National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మూడు గంటల పాటు విచారణ, ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన సోనియా గాంధీ
దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజనానికి విరామం ఇవ్వడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజనానికి విరామం ఇవ్వడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు. భోజనం అనంతరం మరోసారి ఈడీ అధికారులు సోనియాను విచారించనున్నారు. సోనియా వెంట ప్రియాంకా గాంధీ, వైద్యుల బృందం ఉన్నది. ఇదిలా ఉండగా.. ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)