Rahul Night Party Video Row: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీ వీడియోపై స్పందించిన కాంగ్రెస్, ఫ్రెండ్ వివాహ వేడుకకు వెళ్లడం కూడా తప్పేనా అంటూ కౌంటర్
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీ వీడియో పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోలో తప్పేముందని?, ఫ్రెండ్ వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా? అని బీజేపీని సూటిగా ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీ వీడియో పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోలో తప్పేముందని?, ఫ్రెండ్ వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా? అని బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీలా మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట వేడుకకు వెళ్లలేదు.. షరీఫ్‌తో కలిసి కేక్ కట్టింగ్ చేయలేదు. ఆయన పర్యటన తర్వాతే పఠాన్‌కోట్‌లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అని రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు.
రాహుల్ చేసిందాంట్లో తప్పేమీ లేదు. అలా పెళ్లికి వెళ్లడం సంప్రదాయం కూడా. నేరం కాదు. బహుశా బీజేపీ త్వరలో ఇలా బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని ఒక నేరంగా ప్రకటిస్తుందేమో అంటూ సెటైర్లు వేశారు రణ దీప్ సూర్జేవాలా. బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌కు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్.. ఇది ఎవరో చెప్పాలంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.