National Creators Award 2024: అమ్మాయి పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ, జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన
వెంటనే మోదీ కూడా ఆమె పాదాలకు నమస్కరించారు. ప్రధాని నుంచి అవార్డును అందుకుంటున్న క్రమంలో జాన్వీ సింగ్ అని యువతి మోదీ పాదాలకు నమస్కరించబోయింది
దేశంలోనే తొలిసారిగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో(Delhi) ఘనంగా జరిగింది. భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి మోదీ(PM Modi) పాదాలను నమస్కరించబోయింది. వెంటనే మోదీ కూడా ఆమె పాదాలకు నమస్కరించారు. ప్రధాని నుంచి అవార్డును అందుకుంటున్న క్రమంలో జాన్వీ సింగ్ అని యువతి మోదీ పాదాలకు నమస్కరించబోయింది. భారతీయ సంస్కృతిలో పెద్దలకు కాళ్లు మొక్కడం సహజమే.
అలాగే జాన్వీ సింగ్ కూడా గౌరవ సూచకంగా ప్రధాని పాదాలను తాకింది.వెంటనే మోదీ తిరిగి జాన్వీ సింగ్ పాదాలకు నమస్కరించారు. అలా చేయడం తనకు నచ్చదంటూ మోదీ చెప్పారు. హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ విభాగంలో జాన్వీ సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. మోదీ అమ్మాయి కాళ్లకు తిరిగి నమస్కారించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేశంలో తొలిసారిగా ఘనంగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం, 20 విభాగాలలో అవార్డులు ప్రదానం, వీడియోలు ఇవిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)