Viral Video: లాంబోర్గిని కారున ఆపిన ట్రాఫిక్ పోలీస్, ఒక్క ఫోటో దిగుతానంటూ వ్యాపారవేత్తని అడిగిన విధానం వైరల్, వీడియో ఇదిగో..
దీని గురించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి తయారుచేసే లాంబోర్గిని కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో నిశాంత్ సబూ (Nishant Saboo) అనే ఓ వ్యాపారవేత్త తన లాంబోర్గిని కారులో రయ్‌రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇంతలో ఒకచోట ట్రాఫిక్ పోలీసులు అతని కారును ఆపారు. దీంతో అతను ఎందుకు ఆపారా అని ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. కారు వద్దకు వచ్చిన ట్రాఫిక్ కాప్.. చెక్‌చేశాడు. అన్ని పత్రాలు ఉన్నాయని, చలాన్‌లు ఏమీ లేవని ధ్రువీకరించారు.
వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు
అనంతరం నిశాంత్‌ను ఆ ట్రాఫిక్ పోలీసు ఓ కోరిక కోరాడు. లాంబోతో ఫొటోలు తీసుకునేందుకు అనుమతి కోరాడు. కార్లో కూర్చొని ఎంతో సరదాగా ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను నిశాంత్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘పోలీసులు కూడా సూపర్ కార్ల పట్ల మక్కువ కలిగి ఉండటం చాలా గొప్ప విషయం’ అని వీడియోకి క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)