Covid Got Mutated 223 Times: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు మ్యుటేషన్ చెందింది, అందువల్లే దాని ప్రమాద తీవ్రత తగ్గిందని తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు మ్యుటేషన్ చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఒక వైరస్ వంద సార్లు మ్యుటేషన్ చెందినప్పుడు దాని హానికరమైన ప్రభావాలు తగ్గుతాయి. కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందిందని, అందువల్ల దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన్నారు.
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు మ్యుటేషన్ చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఒక వైరస్ వంద సార్లు మ్యుటేషన్ చెందినప్పుడు దాని హానికరమైన ప్రభావాలు తగ్గుతాయి. కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందిందని, అందువల్ల దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన్నారు. సాధారణ ఇన్‌ఫ్లుఎంజా మాదిరిగానే కరోనా కూడా మనతో ఉంటుందని, ఆ వైరస్ అలాగే కొనసాగుతుందని చెప్పారు.
కరోనా సబ్ వేరియంట్స్ అంత ప్రాణాంతకం కాదని, వాటి వల్ల ప్రతికూల ప్రభావాలు లేవని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కరోనా గురించి అన్నారు. ఆరోగ్య సమస్యపై అన్ని దేశాలు, అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో 70 శాతం హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మందులను ఉత్పత్తి చేస్తున్నామని, అలాగే ప్రపంచం మంచిదని భావించే అనేక మెడిసిన్స్‌ను భారత్ ఉత్పత్తి చేస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి ఆయన వివరించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)