COVID-19 Outbreak: గోవాలో కోవిడ్ కల్లోలం, కార్డీలియా నౌకలో 66 మందికి కరోనా, నౌకలోని ప్రయాణికులు ఎవరూ బయటికి రావొద్దని ఆదేశాలు, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపిన గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే
ముంబయి నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 Outbreak On Cordelia Cruise Ship) వెలుగు చూశాయి. కార్డీలియా నౌకలో ప్రయాణిస్తున్న 2 వేల మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్టు గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు.
భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనావైరస్ కలకలం రేగింది. ముంబయి నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 Outbreak On Cordelia Cruise Ship) వెలుగు చూశాయి. కార్డీలియా నౌకలో ప్రయాణిస్తున్న 2 వేల మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్టు గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు. కాగా నూతన సంవత్సరాది సందర్భంగా ఈ నౌకలో ప్రత్యేక ప్యాకేజీతో ప్రయాణ సౌకర్యం కల్పించారు.
అయితే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు (Mumbai-Goa Cruise Ship) నిర్ధారణ కావడంతో, నౌకలోని ప్రయాణికులు ఎవరూ బయటికి రావొద్దని ఆదేశించారు. వారు నౌకను వీడడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. కార్డీలియా క్రూయిజ్ షిప్ పేరు ఇటీవలవరకు మీడియాలో మార్మోగడం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు, మరికొందరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాగా, ఆనాడు రేవ్ పార్టీకి ఈ నౌకే వేదికగా నిలిచింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)