Customs Officials Seize Gold Coins: నడుం కింద బెల్టులో పది కిలోల బంగారు నాణాలు స్మగ్లింగ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులో సీజ్ చేసిన అధికారులు
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బెల్టులో రహస్యంగా బంగారు నాణాలను దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు (Customs officials) తెలిపారు.

జమ్ము కశ్మీర్‌కు చెందిన 43, 45 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులు ఇటలీలోని మిలాన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో వారి లగేజీని స్కాన్ చేయగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఆ ఇద్దరు ప్రయాణికుల్ని వ్యక్తిగతంగా తనిఖీ చేయగా సుమారు 10 కిలోల బంగారం పట్టుబడింది. ప్రత్యేకంగా రూపొందించిన రెండు నడుము బెల్ట్‌లో బంగారు నాణేలను ప్లాస్టిక్ ఎన్వలప్‌లో చుట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన పసిడి విలువ దాదాపు రూ.7.8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ఆ ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Customs officials seize gold coins