Delhi Govt vs Lieutenant Governor Case Verdict: కేంద్రానికి భారీ షాక్, కేజ్రీవాల్ సర్కార్‌కు ఊరట, పాలనలో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవనే 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఢిల్లీ పాలనా వ్యవహారాల నియంత్రణ లెఫ్టినెంట్ గవర్నర్‌దా? లేక ప్రభుత్వానిదా ? అన్న విషయంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవనే 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. శాంతిభద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉంటుందని పేర్కొంది. ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య చాలా కాలంగా వివాదాలు నేపథ్యంలో వీరి అధికారాల పరిధిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Here's Live Law Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)