Khanjawala Hit & Run Case:ఆ నిందితులను ఉరి తీయాలి, కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వెల్లడి

ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

Delhi CM Arvind Kejriwal (Photo-ANI)

ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.తాగిన మత్తులో యువతిని కారుతో ఢీకొట్టి మృతదేహాన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. వారి వారి ఇళ్ల నుంచే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందన్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement