Delhi: వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో కుప్పకూలిన ప్రయాణికురాలికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్, సోషల్ మీడియాలో ప్రశంసలు
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్ ఒక ప్రయాణికురాలకిి CPR ఇవ్వడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళా ప్రయాణికురాలు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అక్కడికక్కడే ఆమె స్పృహ కోల్పోయింది
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్ ఒక ప్రయాణికురాలకిి CPR ఇవ్వడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళా ప్రయాణికురాలు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అక్కడికక్కడే ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని సీపీఆర్ చేసింది. కాసేపటికే ఆమె కోలుకుంది.
వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన మహిళా కానిస్టేబుల్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ మేడం ఒకరి ప్రాణాలు కాపాడారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోని న్యూస్ 24 తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
Woman constable saves life of a passenger by giving him CPR
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)