Delhi's IGI Airport: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ లలో ఢిల్లీ విమానాశ్రయానికి రెండో స్థానం, మూడో స్థానానికి పడిపోయిన దుబాయ్, మొదటి స్థానంలో అట్లాంటా ఎయిర్ పోర్ట్

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ లలో ఢిల్లీ విమానాశ్రయం రెండో స్థానానికి ఎగబాకింది. 2022 మార్చ్ నెలకు గాను గ్లోబల్ ట్రావెల్ డేటా ప్రొవైడర్ సంస్థ 'అఫీషియల్ ఎయిర్ లైన్ గైడ్' (ఓఏజీ) ఈ విషయాన్ని వెల్లడించింది

Delhi Airport( Pic Credit- Wikimedia Commons)

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ లలో ఢిల్లీ విమానాశ్రయం రెండో స్థానానికి ఎగబాకింది. 2022 మార్చ్ నెలకు గాను గ్లోబల్ ట్రావెల్ డేటా ప్రొవైడర్ సంస్థ 'అఫీషియల్ ఎయిర్ లైన్ గైడ్' (ఓఏజీ) ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంగా అమెరికాలోని అట్లాంటా ఎయిర్ పోర్ట్ నిలిచింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు రెండో స్థానానికి ఎగబాకడంతో... అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూడో స్థానానికి పడిపోయింది. కరోనా మహమ్మారికి ముందు 23వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ విమానాశ్రయం 35.5 లక్షల సీట్లను హ్యాండిల్ చేయడం గమనార్హం.