Delhi Air Quality: ఢిల్లీలో విషంగా మారిన గాలి, అత్యంత హీనస్థాయికి పడిపోయిన గాలి నాణ్యత, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో ఏక్యూఐ 400 (సివియర్)కుపైగా నమోదు

ఢిల్లీలో గాలి మళ్లీ కలుషితమైంది. కాలుష్యం ‘తీవ్రస్థాయి’కి చేరింది. ఇవాళ ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)లో గాలి నాణ్యత అత్యంత హీనస్థాయికి పడింది. ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో ఏక్యూఐ 400 (సివియర్)కుపైగా నమోదైంది. మిగతా చోట్ల 312గా రికార్డయింది.

Air Pollution (Representational Image/ Photo Credits: PTI)

ఢిల్లీలో గాలి మళ్లీ కలుషితమైంది. కాలుష్యం ‘తీవ్రస్థాయి’కి చేరింది. ఇవాళ ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)లో గాలి నాణ్యత అత్యంత హీనస్థాయికి పడింది. ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో ఏక్యూఐ 400 (సివియర్)కుపైగా నమోదైంది. మిగతా చోట్ల 312గా రికార్డయింది. నోయిడాలో 479, వివేక్ విహార్ ప్రాంతంలో 471, ఆనంద్ విహార్ లో 451గా ఏక్యూఐ రికార్డయింది. లోధి రోడ్డులో 339గా నమోదైంది. గాలుల వేగం అత్యంత తక్కువగా ఉండడంతో కాలుష్య కారకాలన్నీ గాలిలో చేరాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, దాని వల్ల గాలి శుభ్రమవుతుందని అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement