DGCA Bars 90 SpiceJet Pilots: 90 మంది పైలెట్లపై వేటు వేసిన డీజీసీఏ, మళ్లీ శిక్షణ తీసుకుని విధుల్లో చేరాలని ఆదేశాలు
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుతున్న పైలెట్లపై ఆ చర్యలు తీసుకున్నది.
స్పైస్‌జెట్ సంస్థలో పనిచేస్తున్న 90 మంది పైలెట్లపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వేటు వేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుతున్న పైలెట్లపై ఆ చర్యలు తీసుకున్నది. మ్యాక్స్ విమానాలు నడుతుపున్న పైలెట్లు సరైన రీతిలో శిక్షణ పొందలేదని, వాళ్లు మళ్లీ శిక్షణ తీసుకుని విధుల్లో చేరాలని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొన్నది. విజయవంతంగా మ్యాక్స్ విమానాల ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పైలెట్లు విధుల్లో చేరుతారని డీజీసీఏ బాస్ అరుణ్ కుమార్ తెలిపారు.