Viral Video: భార్య బికినీ ధరించేందుకు ఏకంగా ఓ ఐలాండ్‌ను కొనేసిన భర్త, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
‘‘మీరు బికినీ ధరించాలని కోరుకున్నారు... మీ మిలియనీర్ భర్త ఐలాండ్ కొనేశాడు’’ అని ఆమె పేర్కొంది. ‘‘నా భర్త బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇదే’’ అనే పోస్టుపై క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సౌదీ అల్ నదక్ ఈ వీడియోను పంచుకుంది.
తన భార్య బికినీ ధరించేందుకు వీలుగా ఓ భర్త ఏకంగా ఒక ఐలాండ్‌ను కొనేశాడు.దుబాయ్‌కి చెందిన సౌదీ అల్ నదక్ అనే 26 ఏళ్ల మహిళ ఈ విషయాన్ని చెప్పింది. ‘‘మీరు బికినీ ధరించాలని కోరుకున్నారు... మీ మిలియనీర్ భర్త ఐలాండ్ కొనేశాడు’’ అని ఆమె పేర్కొంది. ‘‘నా భర్త బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇదే’’ అనే పోస్టుపై క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సౌదీ అల్ నదక్ ఈ వీడియోను పంచుకుంది. అయితే ఐలాండ్‌కు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించలేదు.దంపతులు ఇద్దరూ ఛార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణించి ఐలాండ్‌కు చేరుకున్నట్టు వీడియోలో కనిపించింది. అందమైన బీచ్, ఆహ్లాదకరమైన వాతావరణ, రాళ్లు, కొబ్బరి చెట్లు, చుట్టూ పచ్చని వాతావరణం ఈ వీడియోలో ఆకట్టుకునేలా ఉన్నాయి. 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ లభించిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలామంది విమర్శలు గుప్పించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)