Earthquake in Uttarakhand: ఉత్తరకాశీలో భారీ భూకంపం, గత 48 గంటల్లో రాష్ట్రంలో ఇది రెండో సారి, అంతకుముందు నేపాల్‌లో వరుసగా నాలుగు భూకంపాలు

ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు ఉత్తరకాశీలో (Uttarkashi) భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు ఉత్తరకాశీలో (Uttarkashi) భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఉత్తరకాశీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.గత 48 గంటల్లో రాష్ట్రంలో భూకంపం రావడం ఇది రెండోసారి. మంగళవారం పిథోరఘర్‌లో 4.3 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. అంతకుముందు అదే రోజు నేపాల్‌లో వరుసగా నాలుగు భూకంపాలు వచ్చాయి.

Here's News

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement