Ramesh Pokhriyal Covid: కేంద్ర విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్, నన్ను కలుసుకున్న వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని కోరిన రమేశ్ పోఖ్రియాల్
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని ఇవాళ ఆయన వెల్లడించారు. ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ట్విటర్ వేదికగా పోఖ్రియాల్ స్పందిస్తూ.. ‘‘నాకు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలుసుకున్న వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను...’’ అని పేర్కొన్నారు. కాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాశాఖ కార్యకలాపాలను యధాతథంగా కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)