Delhi Excise Policy Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద హైటెన్షన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్, ఆప్ అధినేత సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు. సుమారు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈడీ తనిఖీల నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు. సుమారు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈడీ తనిఖీల నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించారు. సీఎం ఇంటి వద్దకు ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ చేరుకున్నారు.ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. కేజ్రీవాల్ వాడుతున్న సెల్ ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
క్షణంలోనైనా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆప్ మంత్రులు ఒక్కొక్కరూ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు. కాగా కవితను అరెస్ట్ చేసిన ఈడీ బృందమే కేజ్రీవాల్ ఇంట్లోనూ సోదాలు జరుపుతోంది. మరోవైపు ఈడీ సోదాలపై కేజ్రీవాల్ లీగట్ టీం అటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
Here's Videos