Delhi Excise Policy Case: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ తాజాగా ముగిసింది. దీంతో ఈడీ ఆయన్ని ఈ ఉదయం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో పాటు తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ తాజాగా ముగిసింది. దీంతో ఈడీ ఆయన్ని ఈ ఉదయం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో పాటు తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో.. కాసేపట్లో ఆయన్ని జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లనుండటం ఇదే ప్రధమం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలుకు కవిత, ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ తొమ్మిది సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఊరట కోసం కేజ్రీవాల్ కోర్టులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. దీంతో.. సివిల్ లేన్స్‌లోని నివాసంలో మార్చి 22వ తేదీన తనిఖీల పేరుతో వెళ్లిన ఈడీ.. కొన్ని గంటలకే ఆయన్ని అరెస్ట్ చేసి తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు.
Here's ANI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)