Farm Laws Repeal Bill 2021: మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, పూర్తయిన వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ
ఈ మేరకు గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యింది.
వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యింది. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. నవంబర్ 29 నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజునే ఈ బిల్లును రికార్డు సమయంలో ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేసినప్పటికీ లోక్‌సభలో కేవలం నాలుగు నిమిషాల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో స్వల్ప చర్చ అనంతరం ఈ బిల్లును ఆమోదించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై బుధవారం సంతకం చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)