Farmers Protest: నిరసన చేస్తున్న రైతులపై డ్రోన్ల సాయంతో టియర్ గ్యాస్ ప్రయోగం, గాలి పటాలు ఎగరేసి డ్రోన్లను తిప్పి కొట్టిన అన్నదాతలు, వీడియో ఇదిగో..

శంభు సరిహద్దులో ఆందోళన చేస్తున్నరైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను వేయడానికి హర్యానా భద్రతా సిబ్బంది మోహరించిన డ్రోన్‌ను రైతులు తిప్పి కొట్టారు. అంబాలా దగ్గర గాలిపటాలను ఎగరవేసి డ్రోన్ ను వెనక్కి పంపించారు.

Farmers Fly Kites to Take on Drone Dropping Tear Gas Shells on Farmers at Shambhu Border

Farmers Fly Kites to Take on Drone Dropping Tear Gas Shells: శంభు సరిహద్దులో ఆందోళన చేస్తున్నరైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను వేయడానికి హర్యానా భద్రతా సిబ్బంది మోహరించిన డ్రోన్‌ను రైతులు తిప్పి కొట్టారు. అంబాలా దగ్గర గాలిపటాలను ఎగరవేసి డ్రోన్ ను వెనక్కి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. బాష్పవాయువు డబ్బాలను పడవేయడానికి మానవరహిత వైమానిక వాహనాన్ని ఉపయోగించడంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో చాలా మందికి గాయాలయ్యాయి.

డ్రోన్‌ను కిందకు దింపేందుకు గాలిపటాలు ఎగురవేస్తున్నాం’ అని యువ రైతు ఒకరు తెలిపారు. రైతులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించడం సరికాదని, ఇది పూర్తిగా తప్పని మరో రైతు అన్నారు.పంటలకు కనీస మద్దతు ధర, రుణమాఫీపై చట్టం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 'ఢిల్లీ చలో' ఆందోళనలు జరుగుతున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now