Farmers Protest: ఫిబ్రవరి 13న రైతు సంఘాలు ఛలో ఢిల్లీ కార్యక్రమం, నేటి నుంచి దేశ రాజధానిలో 144 సెక్షన్ విధింపు, పెట్రోల్ క్యాన్లు, సోడా బాటిళ్లపైన కూడా నిషేధం
ఈ నేపథ్యంలో ఢిల్లీలో సెక్షన్ 144వ సెక్షన్ విధించినట్లు పోలీసు కమీషనర్ సంజయ్ అరోరా తెలిపారు.
కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ రైతులు ఛలో ఢిల్లీ(Delhi March) కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13వ తేదీన రైతు సంఘాలు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. దేశవ్యాప్తంగా 200 రైతు సంఘాలు, సుమారు 20వేల మంది రైతులు ఢిల్లీపై దండయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సెక్షన్ 144వ సెక్షన్ విధించినట్లు పోలీసు కమీషనర్ సంజయ్ అరోరా తెలిపారు.
ఎక్కువ సంఖ్యలో జనం గుమ్మికూడరాదు అని పోలీసు ఆఫీసర్ ఆరోరా తెలిపారు. కమీషనర్ సంజయ్ అరోరా ఇచ్చిన ఆదేశాల్లో ట్రాక్టర్లపై కూడా నిషేధం విధించారు.పెట్రోల్ క్యాన్లు, సోడా బాటిళ్లపైన కూడా నిషేధం విధించారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే, వారిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. సింగు, ఘాజిపుర్, టిక్రి బోర్డర్ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నగరానికి అన్ని వైపుల ఉన్న బోర్డర్‌లను కట్టుదిట్టం చేశారు.
Here's PTI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)