Fathima Beevi Dies: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఎం ఫాతిమా బీవి మృతి, ఉన్నత స్ధానానికి ఎదిగిన తొలి ముస్లిం మహిళగా అరుదైన గౌరవం
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎం ఫాతిమా బీవి (Fathima Beevi) 96 ఏండ్ల వయసులో అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు అత్యున్నత న్యాయవ్యవస్ధలో ఉన్నత స్ధానానికి ఎదిగిన తొలి ముస్లిం మహిళగా కూడా ఆమె అరుదైన ఘనత సాధించారు.
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎం ఫాతిమా బీవి (Fathima Beevi) 96 ఏండ్ల వయసులో అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు అత్యున్నత న్యాయవ్యవస్ధలో ఉన్నత స్ధానానికి ఎదిగిన తొలి ముస్లిం మహిళగా కూడా ఆమె అరుదైన ఘనత సాధించారు.1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఎదిగి చరిత్ర సృష్టించారు. 1992, ఏప్రిల్ 29న పదవీ విరమణ పొందే వరకూ ఈ పదవిలో కొనసాగారు.
రిటైరైన తర్వాత ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఆపై తమిళనాడు గవర్నర్‌గానూ ఫాతిమా బీవి సేవలందించారు.1950లో బార్ కౌన్సిల్ పరీక్షలో ఆమె అగ్రస్దానంలో నిలిచి బార్ కౌన్సిల్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న తొలి మహిళగా నిలిచారు. 1927 ఏప్రిల్ 30న కేరళలో జన్మించిన ఫాతిమా బీవీని న్యాయ విద్య అభ్యసించాలని తండ్రి ప్రోత్సహించారు.
Here's News