Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప 2 మార్నింగ్ షో సందర్భంగా ధియేటర్లో అగ్నిప్రమాదం, నల్గొండ వెంకటేశ్వరా థియేటర్లో బాణసంచా కాల్చడంతో ఎగసిపడిన నిప్పురవ్వలు
నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్ షోలో పుష్ప 2 ది రూల్ ప్రదర్శించారు. అయితే థియేటర్ లోపల అల్లు అర్జున్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి థియేటర్ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి.
పుష్ప 2 ది రూల్ సినిమా ఎట్టకేలకు ధియేటర్లలోకి వచ్చేసింది. అయితే అభిమానుల అత్యుత్సాహం అక్కడక్కడా కొన్ని సమస్యలను క్రియేట్ చేస్తోంది. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని మహిళా మృతి చెందిన ఘటన మరువక ముందే నల్గొండ జిల్లాలో ఓ ధియేటర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్ షోలో పుష్ప 2 ది రూల్ ప్రదర్శించారు. అయితే థియేటర్ లోపల అల్లు అర్జున్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి థియేటర్ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి. విసిరేసిన పేపర్లకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది, అభిమానులు వెంటనే మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ అగ్ని ప్రమాదంతో సినిమా షో రద్దయ్యినట్లు తెలుస్తోంది.
Fire at Nalgonda Venkateswara theater during Pushpa 2