Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అరెస్ట్, మ‌నీలాండ‌రింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌‌ను అరెస్ట్ చేసిన సీబీఐ, ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ తిరస్కరించిన బాంబే హైకోర్టు

అంత‌కుముందు దేశ్‌ముఖ్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కుంద‌న్ షిండే, కార్య‌ద‌ర్శి సంజీవ్ ప‌ల్నాడెను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వ‌జేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్ పిటిష‌న్‌ను స్వీక‌రించేందుకు తిర‌స్క‌రించింది.

Former Maharashtra Home Minister Anil Deshmukh (Photo Credits: Twitter)

మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అవినీతి కేసులో సీబీఐ బుధ‌వారం అరెస్ట్ చేసింది. అంత‌కుముందు దేశ్‌ముఖ్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కుంద‌న్ షిండే, కార్య‌ద‌ర్శి సంజీవ్ ప‌ల్నాడెను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వ‌జేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్ పిటిష‌న్‌ను స్వీక‌రించేందుకు తిర‌స్క‌రించింది. అవినీతి కేసులో త‌న క‌స్ట‌డీని కోరుతూ సీబీఐ ద‌ర‌ఖాస్తును సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్ధానం అనుమ‌తించ‌డాన్ని దేశ్‌ముఖ్ స‌వాలు చేశారు. సీబీఐ కేసులో ఇద్ద‌రు నిందితుల ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ల‌ను కూడా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే క‌స్ట‌డీని త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని సీబీఐ ఆరోపించింది.

కాగా ముంబై మాజీ పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌రం వీర్ సింగ్ అప్ప‌టి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. న‌గ‌రంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెల‌కు రూ 100 కోట్లు వ‌సూలు చేయాల‌ని పోలీస్ అధికారుల‌కు దేశ్‌ముఖ్ టార్గెట్ విధించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల నేప‌ధ్యంలో దేశ్‌ముఖ్‌పై కేసు న‌మోదు చేయాల‌ని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించ‌డంతో గ‌త ఏడాది ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)