Nandigam Suresh: దళిత మహిళ హత్య కేసులో నందిగం సురేశ్‌కు 14 రోజులు రిమాండ్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా జైలులోనే..
మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేశ్ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేశ్ జైలులోనే ఉన్నారు.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేశ్ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేశ్ జైలులోనే ఉన్నారు. మరోవైపు మంగళగిరి కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతించడంతో తాజాగా మరియమ్మ అనే మహిళ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యాయస్థానం ఈనెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ మరణించింది. అప్పట్లో ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేశ్ పేరును కూడా ఈ కేసులో చేర్చారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)