Telangana: వీడియో ఇదిగో, గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి మృతి, తల్లిని చూడగానే పరిగెత్తుకు వచ్చి తల్లిని చేరకుండానే కుప్పకూలి తిరిగిరాని లోకాలకు..
తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసి ఇంటికి రాగానే తల్లి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లిన చిన్నారి తల్లిని చేరకుండానే ఛాలి నొప్పి అంటూ కుప్పకూలిపడిపోయింది.
ఖమ్మం జిల్లా ఎమ్ వెంకటాయపాలెం లో గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసి ఇంటికి రాగానే తల్లి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లిన చిన్నారి తల్లిని చేరకుండానే ఛాలి నొప్పి అంటూ కుప్పకూలిపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది.
వెంటనే కుటుంబసభ్యులు చిన్నారికి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు.
Four-Year-old girl Dies of Suspected Heart Attack in Khammam
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)