Adani's Wealth Slips Row: 120 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పడిపోయిన అదాని సంపద, కేవ‌లం నెల‌లోనే సుమారు 71 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌ ఆవిరి

నెల క్రితం 120 బిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న ఆయ‌న ఆస్తి విలువ‌ తాజాగా 50 బిలియ‌న్ల డాల‌ర్ల కిందకు ప‌డిపోయింది.అమెరికాకు చెందిన హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ (HIndenburg Research) ఇచ్చిన నివేదిక‌తో అదానీ ఆస్తుల‌న్నీ కుప్పకూలిపోయాయి.

Gautam Adani (File Image)

బిలియనీర్ గౌత‌మ్ అదానీ సంపద రోజు రోజుకు హారతి కర్పూరంలో కరిగిపోతోంది. నెల క్రితం 120 బిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న ఆయ‌న ఆస్తి విలువ‌ తాజాగా 50 బిలియ‌న్ల డాల‌ర్ల కిందకు ప‌డిపోయింది.అమెరికాకు చెందిన హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్(HIndenburg Research) ఇచ్చిన నివేదిక‌తో అదానీ ఆస్తుల‌న్నీ కుప్పకూలిపోయాయి.ప్ర‌స్తుతం ఆయ‌న ఆస్తి విలువ కేవ‌లం 49.1 బిలియ‌న్ల డాల‌ర్లు అని బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) డేటా కథనం తెలుపుతోంది.

నెల క్రితం ప్ర‌పంచంలోనే మూడ‌వ సంప‌న్న వ్య‌క్తిగా ఉన్న అదానీ.. ఇప్పుడు ఆ జాబితాలో చాలా కింద‌కు ప‌డిపోయారు. అదానీ గ్రూపులోని ఏడు ప్ర‌ధాన కంపెనీలు మార్కెట్లో దాదాపు 120 బిలియ‌న్ల డాల‌ర్లు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది.కేవ‌లం నెల‌లోనే అదానీ సుమారు 71 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌ను కోల్పోయారు. టాప్ 500 మంది సంప‌న్న వ్య‌క్తుల జాబితాలో.. అతి త్వ‌ర‌గా సంప‌ద‌ను కోల్పోయిన వారిలో అదానీ నిలిచారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)