Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు, వరుసగా రెండో వారం తగ్గుముఖం, కొనడానికి ఇదే సరైన సమయం

గ్లోబల్‌ ఆర్థికమాంద్యం ఆందోళన, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అటు ఎంసీఎక్స్‌లో గోల్డ్‌ ఫ్యూచర్లు దాదాపు రెండు వారాల కనిష్ట స్థాయికి చేరాయి

Representational Image (Photo Credits: Pixabay)

గ్లోబల్‌ ఆర్థికమాంద్యం ఆందోళన, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అటు ఎంసీఎక్స్‌లో గోల్డ్‌ ఫ్యూచర్లు దాదాపు రెండు వారాల కనిష్ట స్థాయికి చేరాయి. 10 గ్రాముల పసిడి ధర రూ 50,510గా ఉండగా, వెండి ఫ్యూచర్స్‌ కిలో 59,510 వద్ద ఫ్లాట్‌గా ఉన్నాయి. దేశీయంగా హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ. 4745గా ఉంది. 24 క్యారెట్ల పసిడి గ్రాము ధర రూ. 4765గా ఉంది. వెండి కిలో ధర 66 వేల రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇవి వరుసగా రెండో వారం తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు ఔన్సుకు 1,824.72 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now