Goodbye, My Dear Lighthouse: గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్, రతన్ టాటా మరణంపై అత్యంత ఆప్తుడు శంతను నాయుడు ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..
తన స్నేహితుడి (రతన్ టాటా) మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్’ (Goodbye my dear lighthouse) అంటూ వీడ్కోలు పలికారు.
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.రతన్ టాటాకు అత్యంత ఆప్తుడు, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్‌గా, అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడు (Shantanu Naidu).. తన స్నేహితుడి (రతన్ టాటా) మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్’ (Goodbye my dear lighthouse) అంటూ వీడ్కోలు పలికారు.
రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి, కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించిన మహారాష్ట్ర క్యాబినెట్
మీ మరణంతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. మీరు లేని లోటును అధిగమించేందుకు ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలుగుతోన్న దుఃఖం పూడ్చలేనిది. గుడ్ బై.. మై డియర్ లైట్‌హౌస్’ అంటూ శంతను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతంలో తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేశాడు 30 ఏళ్ల శంతను. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Here's Post
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)