Greater Noida Lift Collapse: నోయిడాలో ఘోర ప్రమాదం, నిర్మాణంలో ఉన్న భవనంలో కుప్పకూలిన లిఫ్ట్, నలుగురు అక్కడికక్కడే మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కుప్పకూలి నలుగురు వ్యక్తులు మరణించారు. నివేదికల ప్రకారం, ఈ సంఘటన నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగింది. మృతులంతా భవన నిర్మాణ కార్మికులే. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Greater Noida Lift Collapse

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కుప్పకూలి నలుగురు వ్యక్తులు మరణించారు. నివేదికల ప్రకారం, ఈ సంఘటన నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగింది. మృతులంతా భవన నిర్మాణ కార్మికులే.

బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర్ సిటీ (Gaur City )లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్ట్‌లో నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో లిఫ్ట్‌ కూలడంతో  కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now