GST on Online Gaming: ఆన్‌లైన్ గేములు ఆడేవారికి భారీ షాక్, పందెం కట్టే మొత్తంపై 28 శాతం పన్ను, ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీ అమల్లో.., సిఫారసు చేసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం

ఆన్‌లైన్ గేములు ఆడేవారు, క్యాసినో, రేసు కోర్సులు ఆడే వారి నడ్డి విరిగేలా పన్ను (GST on Online Gaming) పెరగనుంది. ఇప్పటి వరకు ఈ సేవలపై 18 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. దీన్ని 28 శాతానికి పెంచాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మండలి జీఎస్టీ కౌన్సిల్ కు సిఫారసు చేసింది.

GST Council meeting (Photo-Twitter/ Conrad Sangma)

ఆన్‌లైన్ గేములు ఆడేవారు, క్యాసినో, రేసు కోర్సులు ఆడే వారి నడ్డి విరిగేలా పన్ను (GST on Online Gaming) పెరగనుంది. ఇప్పటి వరకు ఈ సేవలపై 18 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. దీన్ని 28 శాతానికి పెంచాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మండలి జీఎస్టీ కౌన్సిల్ కు సిఫారసు చేసింది. జీఎస్టీ తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్ను ఎలా విధించాలన్నదీ మంత్రుల బృందం సూచింది. బెట్టింగ్ సమయంలోనే బెట్టింగ్ అమౌంట్ పై ఈ పన్ను విధించాలన్నది సిఫారసు. దీనివల్ల గేమింగ్ ద్వారా వచ్చే లాభాలపై కాకుండా.. స్థూల ఆదాయంపై పన్ను పడనుందని తెలుస్తోంది. దీంతో గేమింగ్ పరిశ్రమ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రానుంది.

పన్ను పెంచొద్దంటూ ఆన్ లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. మన చట్టాల పరిధిలో కాకుండా, వేరే దేశాల నుంచి నడుస్తున్న వాటిని ప్రోత్సహించినట్టు అవుతుందని, పరిశ్రమ ఆదాయం కోల్పోవడమే కాకుండా.. ప్రభుత్వానికి కూడా పన్ను ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement