Tamil Nadu Rains: శాంతిస్తున్న సూర్యుడు, తమిళనాడులో 13 జిల్లాల్లో భారీ వర్షాలు, మరో 48 గంటలపాటు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటలపాటు రాష్ట్రంలో వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.

rains

సూర్యుడు ఎట్టకేలకు శాంతించాడు, తమిళనాడులో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు వానలు కురుస్తున్నాయి. మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటలపాటు రాష్ట్రంలో వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. రాజధాని చెన్నైలో కూడా రెండురోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటకపోవచ్చని అంచనా వేసింది. నాగపట్టినం, మైలదుతురై, తిరువూర్‌, తంజావూరు, కన్నియకుమారి, తిరునల్వేలి, రామచంద్రపురం, పుదుకొట్టై, శివగంగై, అరియూర్‌, కడలూర్‌, తూత్తుకూడి, టెంకాసి ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురిశాయి. అటు కేరళలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులు బయటకు రావొద్దు, ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపిన ఐఎండీ, తెలంగాణలో కొన్ని జిల్లాలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా..

Here's VIdeos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)