Hijab Row: బికినీ వేసుకోవాలా, చీరకొంగుతో ముసుగు వేసుకోవాలా, జీన్స్ ధరించాలా అనేది మహిళ ఇష్టం, కర్ణాటక విద్యార్థినులకు బాసటగా నిలిచిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా
తాము ఎలాంటి దుస్తులు ధరించుకోవాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని, ఆ హక్కుకు భారత రాజ్యంగం హామీ ఇస్తోందని అన్నారు.
హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చారనే కారణంగా తరగతి గదులకు అనుమతించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా బాసటగా నిలిచారు. తాము ఎలాంటి దుస్తులు ధరించుకోవాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని, ఆ హక్కుకు భారత రాజ్యంగం హామీ ఇస్తోందని అన్నారు. బికినీ వేసుకోవాలా, చీరకొంగుతో ముసుగు వేసుకోవాలా, జీన్స్ ధరించాలా అనేది ఆమె ఇష్టాన్ని బట్టే ఉంటుందని అన్నారు. వస్త్రధారణ పేరుతో మహిళలను వేధించడం ఆపాలని ఒక ట్వీట్‌లో ప్రియాంక పేర్కొన్నారు. 'లడ్‌కీహూ లడ్‌సక్‌తీ హూ' అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా ఇచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)