Hijab Row: హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లన్నీ కొట్టివేత

హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లన్నీ కొట్టేసింది. ఈ మేరకు న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. కాగా కర్ణాటక నుంచి మొదలై.. దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది హిజాబ్‌ వ్యవహారం.

Karnataka High Court (Photo Credits: Wikimedia Commons)

హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లన్నీ కొట్టేసింది. ఈ మేరకు న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. కాగా కర్ణాటక నుంచి మొదలై.. దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది హిజాబ్‌ వ్యవహారం. కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించలేదు. ఈ అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న.. కర్ణాటక హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.

విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదని పేర్కొంది. ఇక హిజాబ్‌ తీర్పు నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. హిజాబ్‌ వివాదం మొదలైన.. ఉడుపిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement