CDS General Bipin Rawat Dies: జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత, ఆయన భార్య మధులికా రావత్ తో సహా 11 మంది ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మృతి, అధికారికంగా ప్రకటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయణిస్తున్న హెలికాప్టర్ మరో పది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో 12 మంది మరణించారు. వీరిలో ఆయన భార్య మధులికా రావత్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ట్వీట్ చేసింది.
చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయణిస్తున్న హెలికాప్టర్ మరో పది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో సహా 12 మంది మరణించారు. వీరిలో రావత్ భార్య మధులికా రావత్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ట్వీట్ చేసింది.
ఇదిలా ఉంటే బిపిన్ రావత్ ఆరేళ్ల కిందట ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2015లో ఆయన లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉండగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బందితో కలిసి నాగాలాండ్ లో చీటా హెలికాప్టర్ ఎక్కారు. ఫిబ్రవరి 3న ఆ హెలికాప్టర్ దిమాపూర్ జిల్లాలోని రగ్బాపహార్ హెలిప్యాడ్ నుంచి గాల్లోకి ఎగిసింది. అయితే టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. గాల్లో 20 అడుగుల ఎత్తుకు ఎగిరిన అనంతరం ఇంజిన్ నిలిచిపోవడంతో చీటా హెలికాప్టర్ కిందికిపడిపోయింది. ఈ ఘటనలో రావత్ కు స్వల్ప గాయాలు తగిలాయి. అయితే ఈ సారి మాత్రం ప్రమాదం నుంచి ఆయన బటయపడలేకపోయారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)