Indian Air Force: అద్భుతం..ఈజిప్ట్ మిగ్29, రాఫెల్ ఫైటర్లకు ఆకాశంలోనే ఇంధనం నింపిన భారత వైమానిక ఐఎల్-78 ట్యాంకర్, వీడియో ఇదిగో..
ఈజిప్టు వైమానిక దళానికి చెందిన మిగ్29 ఎం, రాఫేల్ యుద్ధ విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపింది. కాగా ఈజిప్టులో ఎక్స్ బ్రైట్ స్టార్ 23(Ex Bright Star 23) పేరుతో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి.
Indian Air Forceకు చెందిన ఐఎల్-78 ట్యాంకర్.. ఈజిప్టు వైమానిక దళానికి చెందిన మిగ్29 ఎం, రాఫేల్ యుద్ధ విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపింది. కాగా ఈజిప్టులో ఎక్స్ బ్రైట్ స్టార్ 23(Ex Bright Star 23) పేరుతో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాల్లో సుమారు 34 దేశాలకు చెందిన త్రివిధ దళాలు తమ సత్తా చూపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-78 ట్యాంకర్ తన విన్యాసాన్ని ప్రదర్శించింది.
ఈజిప్టు సైన్యానికి చెందిన మిగ్29, రాఫేల్ ఫైటర్లకు .. ఆ ట్యాంర్ ద్వారా ఆకాశంలోనే ఇంధనాన్ని నింపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్29 కూడా పాల్గొన్నది.అలాగే భారతీయ నేవీకి చెందని ఐఎన్ఎస్ సుమేదా ఈ ఈవెంట్‌లో పాల్గొంటోంది. సుమారు రెండు వారాల పాటు నిర్వహించే మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో ఎక్సర్‌సైజ్ బ్రైట్ స్టార్ 23 ఈవెంట్ చాలా పెద్దది.
Here's Video