Bomb Cyclone Live Video: సుడులు తిరుగుతూ బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో వీడియో ఇదిగో, పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి చేరుకుంటున్న తుపాను
తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న భయానకమైన దృశ్యం ఉపగ్రహం కంటికి చిక్కింది.
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ తుపాను లైవ్ వీడియో బయటకు వచ్చింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న భయానకమైన దృశ్యం ఉపగ్రహం కంటికి చిక్కింది. బాంబ్ సైక్లోన్ భయంకరంగా సుడులు తిరుగుతుండడం ఈ వీడియోలో కనిపించింది. తుపాను కారణంగా వాషింగ్టన్‌లోని లిన్‌వుడ్‌లో చెట్లు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
భారీ వర్షాలు భయపెడుతుండగా, విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం ఆరు లక్షల ఇళ్లపై పడింది. వాషింగ్టన్, ఓరెగావ్, కాలిఫోర్నియాలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. స్కూళ్లు మూతపడ్డాయి. బాంబ్ సైక్లోన్ ప్రభావం కెనడా, బ్రిటిష్ కొలంబియాపైనా పడింది. కెనడాలోని పసిఫిక్ తీర ప్రాంతంలో 2.25 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
Bomb Cyclone Live Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)