Independence Day 2022: హిమాలయ పర్వతాల్లో మోగిన భారత్ మాతాకి జై నినాదాలు, సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించిన సైన్యం
ఇండోటిబెటన్ బార్డర్ పోలీసులు (ITBP) భారత్-చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.
76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇండోటిబెటన్ బార్డర్ పోలీసులు (ITBP) భారత్-చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ మాతాకి జై నినాదాలతో హిమాలయ పర్వతాలు మారుమోగాయి.అదేవిధంగా సిక్కింలో సముద్రమట్టానికి 18,800 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. జాతీయ పతాకాన్ని చేతబూని పరేడ్ నిర్వహించారు. మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)