COVID in India: దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా, 35 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య, గత 24 గంటల్లో మహమ్మారితో 14 మంది మృతి
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 85,076 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,880 కేసులు బయటపడ్డాయి.ఈ సంఖ్యతో దేశంలో యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 35 వేల మార్క్‌ను దాటింది
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 85,076 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,880 కేసులు బయటపడ్డాయి.ఈ సంఖ్యతో దేశంలో యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 35 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 35,199 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.
గత 24 గంటల వ్యవధిలో మొత్తం 14 మంది మృతి చెందగా.. కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,30,979కి చేరింది.ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో (Positive Cases) 0.08 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.73 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,23,527) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Here's PTI Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)