New Delhi, JAN 11: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు (IND vs ENG 2025 T20I Series) బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు. చీలమండ గాయం కారణంగా నవంబర్ 2023 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ గతేడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. దాదాపు 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో షమీ తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. క్వార్టర్ ఫైనల్‌లో బరోడాపై రెండు వికెట్ల పడగొట్టాడు.
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మూడు మ్యాచులు ఆడి.. ఐదు వికెట్ల తీసుకున్నాడు. గత కొద్ది నెలలుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని భావించినా చోటు దక్కలేదు. తాజాగా సెలెక్టర్లు వైద్య బృందంతో చర్చించి తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. షమీ టీ20ల్లో 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతున్నారు. అప్పటి నుంచి మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. షమీ 23 టీ20 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. టీ20 సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది.
India's Squad for T20I Series Against England Announced
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
Mohammad Shami returns as India’s squad for T20I series against England announced.
All The Details 🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank https://t.co/jwI8mMBTqY
— BCCI (@BCCI) January 11, 2025
టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).