Yuvraj Singh and Virat Kohli (Photo Credits: @CricStrickAP/X)

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హిందీ న్యూస్ మీడియా సంస్థ ‘లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీయే పరోక్ష బాధ్యుడు అని తెలిపారు. యూవీ క్యాన్సర్ నుంచి కోలుకున్నాక జట్టులోకి పునరాగమనం చేశాడని, అయితే ఫిట్‌నెస్ విషయంలో కాస్త మినహాయింపులు ఇవ్వాలని కోరినప్పటికీ నాడు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఒప్పుకోలేదని ఉతప్ప వ్యాఖ్యానించాడు.టీ20 వరల్డ్ కప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడు రాబిన్ ఊతప్ప.

ఊతప్ప మాట్లాడుతూ.. యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ను ఓడించాడు. మన దేశం రెండు వరల్డ్ కప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ప్లేయర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జట్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ సహకరించాల్సి ఉందన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన

క్యాన్సర్ కారణంగా అతడి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయిందని మీకు తెలుసు. అతడి ఇబ్బందులను మీరు స్వయంగా చూశారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలను పాటించాలనేది నిజమే. కానీ నిబంధనల విషయంలో ఎల్లప్పుడూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. ముఖ్యంగా యువరాజ్ సింగ్ మినహాయింపులకు అర్హుడు. అతడు కేవలం క్రికెట్ వరల్డ్ కప్‌లనే కాదు, క్యాన్సర్‌ను కూడా జయించాడు. ఈ విషయాలు నాతో ఎవరూ చెప్పలేదు. నేనే గమనించాను’’ అని ఉతప్ప పేర్కొన్నాడు.

Robin Uthappa's Interview 

ఎస్ఎం ధోనీ నాయకత్వంలోని 2011లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్ సాధించడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో చెలరేగి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది పెనుసంచలనం నమోదు చేశాడు. ఆ తర్వాత అనూహ్యంగా క్యాన్సర్ బారినపడి జట్టుకు దూరమయ్యాడు. క్యాన్సర్‌ను జయించి భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. రీఎంట్రీలో ఇంగ్లండ్‌పై వన్డేలో సెంచరీ కూడా బాదాడు. అయితే, 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించకపోవడంతో సెలక్టర్లు యూవీని పక్కనబెట్టారు. దీంతో 2019లో యూవీ రిటైర్‌మెంట్ ప్రకటన చేశాడు.