National Youth Day, Swami Vivekananda Jayanti 2025 Wishes: అంతర్జాతీయ వేదికపై భారతీయతత్వాన్ని చాటిన మహోన్నత అధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు నేడు జాతీయ యువజన దినోత్సవం. భరతజాతి సాంస్కృతిక వైభవం విశ్వ వ్యాప్తం చేయడం కోసం ఆజన్మాంతం కృషి చేసిన శ్రీ స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉందని స్వామి వివేకానంద నమ్మారు. ఆయన ఎంతో మంది యువతకు స్ఫూర్తి. అందుకే వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవం (National Youth Day)గా జరుపుకుంటున్నాం. 1863 జనవరి 12న జన్మించిన నరేంద్రనాథ్ దత్తా పేరుతో జన్మించిన వివేకానంద, సాంఘిక సంస్కరణ, తత్వశాస్త్రంలో దిట్ట. విదేశీ పాలనలో మసకబారిన మనదేశ ఖ్యాతిని హిందూ మతం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి స్వామి వివేకానందుడిగా వెలుగొందిన భారతీయ యువకుడు. ఆయనను గౌరవించడానికే ఈ రోజు "జాతీయ యువజన దినోత్సవం"గా జరుపుకుంటున్నాం. ప్రపంచ యువతపై అత్యంత ప్రభావాన్ని చూపిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద. అందుకే ఆ మహానుభావుడి పుట్టిన రోజును ఏటా ‘జాతీయ యువజన దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నాం. దేన్నైనా సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని ఒక వ్యక్తిలో కలిగించడం కన్నా మించిన సాయం లేదన్నారు వివేకానంద. నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాభినందనలు తెలియజేయాలంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ మీకోసం.
యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు
అంతర్జాతీయ వేదికపై భారతీయతత్వాన్ని చాటిన మహోన్నత అధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు
భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
నేడు జాతీయ యువజన దినోత్సవం వివేకానందుడి జయంతి సందర్బంగా.. ఆ మహనీయుడిని ఆదర్శం గా తీసుకొని యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తూ.. అందరికీ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
భారతీయ సనాతన సాంస్కృతిక వారధి, హిందూ ధర్మసారథి, అణువణున దేశభక్తి, కణకణమున ధర్మానురక్తి, భారతదేశాన్ని జాగృతపరిచిన మహర్షి, అనునిత్యం దేశం కోసమే తపించిన తాపసి, శ్రేష్ఠ సన్యాసి, స్వామి వివేకానంద జయంతి- జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.