Lancet says one in eight people globally is now obese (Photo Credit: Pixabay)

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. దీనికి కారణం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం చెడు కొలెస్ట్రాల్ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్ ,గుండెపోటు వంటి ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. అయితే మన జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం ద్వారా అంతేకాకుండా మన ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా హై కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ ను తగ్గించాలి. అవిస గింజలు, గోరువెచ్చని నీరు వెల్లుల్లి వంటివి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. అయితే ఉదయాన్నే ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి- అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వెల్లుల్లి కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. దీన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్ సి ,మెగ్నీషియం, సెలీనియం, జింక్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి .వీటిని తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గుతుంది. అయితే కొంతమంది పచ్చి వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు. అటువంటి అప్పుడు మీరు కాస్త దోరగా వేయించుకొని తినవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గుండెకు మంచిది- వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. గుండెపోటు రాకుండా ఉంచుతుంది.

శరీరంలోని మలినాలను తొలగిస్తుంది- ప్రతిరోజు రెండు పచ్చి వెల్లుల్లి తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను కూడా తొలగించి చీరలు శుభ్రపరుస్తాయి. శరీరం లోపట కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది. వ్యాధుల నుండి బయట పడేలాగా చేస్తుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది- వెల్లుల్లిలో రక్తపోటును తగ్గించే అనేక అంశాలు ఉన్నాయి. బీపీ అధికంగా ఉన్నవారు ప్రతిరోజు రెండు వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా బిపి నార్మల్గా అవుతుంది. అంతేకాకుండా గుండె సంబంధ సమస్యలు రాకుండా కూడా చేస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి