
Hyderabad, JAN 11: రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇటీవలే పుష్ప 2 (Pushpa 2) సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన నటనతో, డ్యాన్సులతో ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా 1830 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అయితే ఇటీవల రష్మిక జిమ్ లో గాయపడిందని (Rashmika Mandanna Injured) వార్తలు వచ్చాయి. తాను చేస్తున్న సికిందర్ సినిమా షూట్ కూడా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.
తాజాగా రష్మిక దీనిపై అధికారికంగా పోస్ట్ చేసింది. తన కాలికి కట్టు కట్టగా సోఫాలో దిగాలుగా కుర్చొని ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ రష్మిక.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జిమ్ లో గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్ లో ఉన్నాను. కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పడుతుందో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. నేను మళ్ళీ తామా, సికిందర్, కుబేర సెట్స్ కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. నా డైరెక్టర్స్ కి సారీ. నేను త్వరగా తిరిగి వచ్చి యాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ లోపు నేను మీకు అవసరమైతే ఒక మూలాన కూర్చొని అడ్వాన్స్ పని చేస్తాను అని తెలిపింది.
Rashmika Mandanna Injured
View this post on Instagram
దీంతో రష్మిక పోస్ట్ వైరల్ గా మారింది. రష్మిక త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. సౌత్, హిందీ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో చావా, తామా, సికిందర్, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్.. ఇలా అరడజను సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న సమయంలో ఇలా జరిగి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావడం కష్టమే.