National Youth Day 2025, Swami Vivekananda Jayanti Wishes: ప్రపంచ యువతపై అత్యంత ప్రభావాన్ని చూపిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద. అందుకే ఆ మహానుభావుడి పుట్టిన రోజును ఏటా ‘జాతీయ యువజన దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నాం. దేన్నైనా సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని ఒక వ్యక్తిలో కలిగించడం కన్నా మించిన సాయం లేదన్నారు వివేకానంద. ఈ రోజు నిరాశా, నిస్పృహలతో, మత్తు పదార్థాల బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న యువతలో బలమైన ఆత్మవిశ్వాసం కలిగించడమే మన ముందున్న కర్తవ్యం. ఇందుకు వివేకానందుని స్ఫూర్తిని అందుకుందాం. విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతో పాటూ సామాజిక బాధ్యతనూ, స్వావలంబననూ పెంపొందించాలని ఎలుగెత్తి చాటిన స్వామి వివేకానందుని జయంతిని ప్రతి ఏడాదీ జనవరి 12న 'జాతీయ యువజన దినోత్సవం'గా జరుపుకొంటున్నాం. యువతకు స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి, మనదేశ కీర్తి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుతున్న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం.
భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
యువశక్తికి దేశభక్తిని నూరిపోసిన చైతన్య మూర్తి వివేకానందుని ప్రసంగాలు సదా ఆచరణీయం.
యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి, భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన చైతన్యమూర్తి శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా... ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు
స్ఫూర్తి ప్రదాత,చైతన్య మూర్తి,దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహామనిషి "స్వామి వివేకానంద” గారి జయంతి సందర్భంగా ఆ మహనీయనికి ఇవే మా ఘన నివాళులు.
భరతజాతి సాంస్కృతిక వైభవం విశ్వ వ్యాప్తం చేయడం కోసం ఆజన్మాంతం కృషి చేసిన "శ్రీ.స్వామి వివేకానంద" గారి జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు.
నేడు జాతీయ యువజన దినోత్సవం వివేకానందుడి జయంతి సందర్బంగా.. ఆ మహనీయుడిని ఆదర్శం గా తీసుకొని యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తూ.. అందరికీ యువజన దినోత్సవ శుభాకాంక్షలు