Indian Army Dog Dies: సైనికున్ని రక్షిస్తూ ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందిన సైనిక జాగిలం, వీడియో ఇదిగో..

సైనికుని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను పనంగా పెట్టింది భారత ఆర్మీకి చెందిన జాగిలం. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెంట్ అనే సైనిక జాగిలం ప్రాణాలను కోల్పోయినట్లు ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందిందని తెలిపింది.

Army dog Kent (Photo-ANI)

సైనికుని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను పనంగా పెట్టింది భారత ఆర్మీకి చెందిన జాగిలం. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెంట్ అనే సైనిక జాగిలం ప్రాణాలను కోల్పోయినట్లు ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందిందని తెలిపింది.ఆపరేషన్‌ సుజలిగల'లో భాగంగా జమ్మూ రాజౌరీ జిల్లాలోని నార్లా ప్రాంతంలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపడుతోంది. వారికి తోడుగా 21వ ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన ఆరేళ్ల కెంట్ అనే కుక్కను తీసుకువెళ్లారు.

సైనికులందరూ కెంట్‌ను అనుసరిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టిన కెంట్.. సైన్యాన్ని అప్రమత్తం చేసింది.ఈ క్రమంలో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఉగ్రవాదులు ఓ సైనికున్ని చుట్టుముట్టారు. అతన్ని రక్షించడం కోసం కెంట్ ఉగ్రవాదులకు ఎదురునిలిచింది. ఈ క్రమంలో తూటాలు తగిలి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది, ఒక ఆర్మీ జవాన్ మరణించారని వెల్లడించారు.

Army dog Kent (Photo-ANI)

Here's ANI VIdeo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement