Indian Army Helicopter Crash: కుప్పకూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్, తమిళనాడు కూనూరు వద్ద విషాద ఘటన, ప్రమాదంలో ముగ్గురు మృతి

తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారని సమాచారం.

Indian Army Helicopter Crash

తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారని సమాచారం. ముగ్గురిని కాపాడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయని, నాలుగో వ్యక్తి కోసం గాలింపు జరుగుతోందని తెలుస్తోంది. గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్‌మెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆర్మీ హెలికాప్ట‌ర్ పూర్తిగా కాలిపోయింది. ఆ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందినట్లు ప్ర‌క‌టించారు. కానీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావ‌త్ ఉన్నారా లేదా అన్న విష‌యం స్ప‌ష్టంగా తెలియ‌దు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement