IndiGo Fined Rs 1.20 Crore: రన్ వేపై భోజనాలు వీడియో వైరల్, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.1.20 కోట్ల జరిమానా విధించిన డిజిసిఎ
ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై ప్రయాణికులను కూర్చోబెట్టి వారికి ఆహారం అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.1.20 కోట్ల జరిమానా చెల్లించాలని డిజిసిఎ ఆదేశాలు జారీ చేసింది
ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై ప్రయాణికులను కూర్చోబెట్టి వారికి ఆహారం అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.1.20 కోట్ల జరిమానా చెల్లించాలని డిజిసిఎ ఆదేశాలు జారీ చేసింది. ఓ విమానం గంటల తరబడి ఆలస్యమై ఆ తర్వాత దారి మళ్లించడంతో ప్రయాణికులు రన్‌వేపై ఆహారం తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో విమానయాన మంత్రిత్వ శాఖ, జనవరి 16, మంగళవారం, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
గోవా నుండి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానం 12 గంటల ఆలస్యం తర్వాత ముంబై వైపు మళ్లించబడింది, ఆ తర్వాత ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రన్‌వేపైనే కూర్చోని ఆహారం తినవలసి వచ్చింది. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒకదానిలో ప్రయాణీకులు రన్‌వేపై నేలపై కూర్చొని తినడం చూపించారు.
Here's ANI Tweet