Indigo Plane Bomb Scare: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు, నిర్మానుష్య ప్రదేశంలో అత్యవసర లాండింగ్, వీడియో ఇదిగో..

ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు కలకలం రేపింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరాల్సి ఉన్నది.

Representative Image (Photo Credit- Wikimedia Commons)

ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు కలకలం రేపింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరాల్సి ఉన్నది. అయితే టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై బాంబు అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందికి దించేశారు. ఢిల్లీ పాఠశాలల్లో బాంబు కలకలం..పలు స్కూల్స్ కి సెలవు

అనంతరం ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విమానాన్ని నిర్మాణుష్య ప్రదేశానికి తరలించారని, ఏవియేషన్‌ సెక్యూరిటీ అధికారులు, బాంబు డిస్పోజల్‌ టీం క్షుణ్ణంగా తనిఖిచేస్తున్నదని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు.కాగా, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now