Shaik Darvesh Saheb: కేరళ నూతన డీజీపీగా తెలుగోడు షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌, ఆనందం వ్యక్తం చేస్తున్న స్నేహితులు

కేరళ డీజీపీగా వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.బక్రీద్‌ రోజున దర్వేష్‌ సాహెబ్‌కు ఉన్నత పదవి దక్కడంతో ఇక్కడ ఆయన బాల్య స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Shaik Darvesh Saheb (Photo-ANI)

Shaik Darvesh Saheb Appointed As New DGP Of Kerala: కేరళ డీజీపీగా వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.బక్రీద్‌ రోజున దర్వేష్‌ సాహెబ్‌కు ఉన్నత పదవి దక్కడంతో ఇక్కడ ఆయన బాల్య స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలోని బెస్తవీధికి చెందిన ఆయన ప్రాథమిక విద్య పోరుమామిళ్లలో పూర్తి చేశారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ప్రైవేటు పాఠశాల, ఆరు నుంచి పది వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్‌ జూనియర్‌ కళాశాలలో చదివారు. డిగ్రీ, పీజీ తిరుపతిలో పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ డీజీపీగా నియమితులవడంపై పట్టణ ప్రజలు, ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)